స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్‌కు 7 వేల ఐడియాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్య స్థాయిలోనే విద్యార్థుల్లో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి చేపట్టిన స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్‌కు విశేష స్పందన లభించింది.
రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలోని 25 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు మొత్తం 7,093 ఐడియాలను ఈ చాలెంజ్‌కు పంపించారు. యూనిసెఫ్, పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్, ఇన్‌క్వి-ల్యాబ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ చాలెంజ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరులోగా గ్రాండ్ ఫినాలే నిర్వహించి అత్యుత్తమ ఐడియాను ఎంపిక చేస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
Published date : 27 Nov 2020 01:54PM