స్కూల్ ఎగ్జామ్స్ నుంచి సివిల్స్ వరకు ప్రిపేర్ అయ్యేవారికి అద్భుత అవకాశం
- పాఠశాల స్థాయి నుంచి సివిల్స్ వరకు పోటీ పరీక్షల సన్నద్ధం కోసం.
- కేవలం రూ.99కే యాప్ అందుబాటులో.
- యాప్ విడుదల చేసిన కాల్కస్ ఇండియా.
ఆన్‌లైన్ క్లాసులు మాత్రమే జరుగుతున్న ఈ రోజుల్లో విద్యార్ధులు పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలంటే కొంత కష్టమైన పని. ఆన్‌లైన్ క్లాసులు విన్న తరువాత వాటికి సంబంధించిన ప్రశ్నలను ప్రాక్టీస్ చెయ్యాలంటే విడిగా అనేక రకాల స్టడీ మెటీరియల్ కొనుక్కోవాలి. అలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ‘కాల్కస్ ఇండియా ఎగ్జామ్స్ ప్రిపరేషన్ యాప్’ విడుదల చేసారు. ఇందులో పాఠశాల స్థాయి నుంచి సివిల్ ఎంట్రన్స్ స్థాయి వరకు పరీక్షలకు సంబంధించిన మాక్ టెస్ట్స్, చాప్టర్ వైస్ ప్రాక్టీస్ టెస్ట్స్, గత పరీక్షల ప్రశ్నపత్రాలు, లేటెస్ట్ పరీక్ష నమూనా ప్రశ్నపత్రాలను పొందుపరిచారు. ఇందులో ప్రశ్నలను ప్రాక్టీస్ చెయ్యటమే కాకుండా విద్యార్ధి నైపుణ్యతను కూడా తెలుసుకోవచ్చును. ముఖ్యంగా యాప్‌లో మొత్తం 1324 విభాగాల లో 42 వేల ప్రాక్టీస్ టెస్ట్‌లతో కూడిన 25 బండిళ్లను అందుబాటులో ఉంచారు.
1324 విభాగాలతో 42 వేల ప్రాక్టీస్ టెస్ట్‌లు...:
కాల్కస్ ఇండియా యాప్‌లో ఎన్నో రకాల పొటీ పరీక్షలు పొందుపర్చారు. ఇందులో సీబీఎస్‌సీ, ఐసీఎస్‌సీ, కేవీపీవై, ఎన్‌పీఓ, ఎంటీఎస్‌సీ, హెచ్‌బీబీవీఎస్, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్, జవహర్ నవోదయ ఎంట్రన్స్, ఎస్‌ఓఎఫ్ ఎన్‌ఎస్‌ఓ ఇంగ్లిష్ ఒలంపియాడ్, సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్-నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ వంటి పొటీ పరీక్షలే కాకుండా ఇంజనీరింగ్, మెడికల్, ఎంసెట్, రైల్వే, పోలీస్, డిఫెన్స్, మేనేజ్మెంట్, బ్యాంకింగ్, టీచింగ్, ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ, టెట్, డీఎస్సీ, సివిల్స్ ఎంట్రన్స్ వంటి మరెన్నో 1324 రకాల పొటీ పరీక్షలు ఈ యాప్‌లో పొందుపరిచినట్లు సంస్థ వ్యవస్థాపకురాలు వాణికుమారి తెలిపారు.
తెలుగు మీడియం విధ్యార్ధుల కోసం...
తెలుగు రాష్ట్రాల విద్యార్ధుల కోసం తెలుగులో కూడా ప్రశ్నపత్రాలను సంబంధిత పరీక్షల నోటిఫికేషన్ ఆధారంగా పొందు పర్చడం జరుగుతుంది.
సంవత్సరానికి 99 రూపాయలకే..
ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు ఆపై వేర్వేరు తరగతులు చదువుతున్నా కేవలం రూ. 99తో సబ్‌స్రైబ్ చేసుకుంటే అన్ని తరగతులకు చెందిన ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ కావచ్చు. ఏవైనా పరీక్షలు రాసే అభ్యర్దులు సాధారణంగా ఎన్ని పరీక్షలు కావాలనుకుంటే అన్ని రకాల ప్రశ్నపత్రాలను కొనుక్కోవాలి, కానీ ఈ యాప్ లో ఒక బండిల్ లో పొందుపరిచిన అన్ని రకాల పరీక్షలను 99 రూపాయల సబ్స్క్రిప్షన్ తో సంవత్సర కాలంపాటు అపరిమితంగా ప్రాక్టీస్ చెయ్యవచ్చును. యాప్ విడుదల సందర్భంగా పరిమిత సంఖ్యలో టెస్ట్ లను ఉచితంగా అందుబాటులో ఉంచారు. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్దులు ఉచిత టెస్టులను ప్రాక్టీస్ చేసి ఇంకా కావాలనుకున్న వారు 99 రూపాయలతో సబ్‌స్రైబ్ చేసుకోవచ్చును.
అందరికీ విద్య - అందుబాటు ధరలో.. !
“అందరికీ విద్య - అందుబాటు ధరలో” అనే లక్ష్యంతో 99 రూపాయలకే ఒక విభాగంలో ఉన్న అన్ని రకాల పరీక్షలను అపరితంగా సాధన చేసుకొనే అవకాశం ఇస్తున్న భారతదేశపు మొట్ట మొదటి సంస్థ కాల్కస్ ఇండియా అని, అతి తక్కువ ధరలో అందించే ఈ సదుపాయన్ని సద్వినియోగపర్చుకోవాలని కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకురాలు వాణీకుమారి తెలిపారు. దీన్ని గూగుల్ ప్లే స్టోర్‌లో calcusindia ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://calcusindia.com ను సందర్శించవచ్చు.