సివిల్ సర్వీస్ పరీక్షలకు రూ.50కోట్లు ఖర్చు చేశాం.. వాయిదా వేయడం కుదరదు
Sakshi Education
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
దీనిపై సెఫ్టెంబర్ 30న కోర్టు విచారణ జరిపింది. పిటిషన్‌దారు యూపీఎస్సీ నుంచి రిలాక్సేషన్ కోరినట్లయితే.. అది మర్యదపూర్వకంగా.. ఒప్పించేదిగా ఉండాలని సూచించింది. యూపీఎస్సీ బోర్టు పరీక్షలు నిర్వహించడానికే మొగ్గు చూపుతుందని కోర్టు స్పష్టం చేసింది. అభ్యర్థుల రవాణాకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని యూపీఎస్సీ ఇప్పటికే రాష్ట్రాలను కోరిందని కోర్టు తెలిపింది. కరోనా నేపథ్యంలో అసాధారణ పరిస్థితులు తలెత్తాయని.. పరీక్షలు వాయిదా వేయాలని పిటిషనర్లు వాదించారు. అయితే ఇప్పటికే పరీక్ష నిర్వహణ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని..సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని యూపీఎస్సీ మరోసారి స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 4వ తేదీనే పరీక్ష జరుగుతుందని తెలిపింది. ఈమేరకు యూపీఎస్సీ అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఇప్పుడు పరీక్షలు వాయిదా వేస్తే ఆ ప్రభావం వచ్చ ఏడాది జూన్ 27న జరిగే పరీక్షపై పడుతుందని పేర్కొంది.
Published date : 30 Sep 2020 04:45PM