సింగరేణి ఉద్యోగులకు శుభవార్త
Sakshi Education
సాక్షి, రామగుండం: బొగ్గు గని కార్మికుల పీఎల్‌ఆర్ బోనస్ ఖరారైంది.
రాంచీలో అక్టోబర్ 15వ తేదీన జరిగిన జేబీసీసీఐ స్టాండర్డయిజేషన్ కమిటీ సమావేశంలో ఫెర్ఫార్మెన్స్ లింక్‌డ్ రివార్డు(పీఎఆర్) బోనస్‌పై నిర్ణయం తీసుకున్నారు. కోలిండియా యాజమాన్యాలతోపాటు జాతీయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇరువర్గాల చర్చల అనంతరం రూ.68,500గా నిర్ణయించారు. గతేడాది రూ.64,700 చెల్లించగా, ఈ ఏడాది మరో 3,800 పెంచారు. ఉదయం 10 గంటల నుంచి జరిగిన సమావేశంలో మొదట సమ్మె ప్రతిపాదన ఉన్న సమయంలో బోనస్‌పై చర్చించలేమని సీఐఎల్ యాజమాన్యం పేర్కొనడంతో కొంతసేపు ప్రతిష్టంభన ఏర్పడింది. కరోనా వైరస్ నేపథ్యంలో బొగ్గు సంస్థలు నష్టాల్లో ఉన్నాయని బోనస్ చెల్లించలేమని యాజమాన్యం పేర్కొంది. జాతీయ కార్మిక సంఘాలు వ్యతిరేకించి బోనస్ చెల్లించాలని పట్టుబట్టాయి. ఈ క్రమంలో జాతీయ కార్మిక సంఘాలు రూ.75 వేలు డిమాండ్ చేయగా, చివరికి రూ. 68,500 చెల్లించేందుకు అంగీకారం కుదిరింది.
Published date : 16 Oct 2020 02:48PM