సీవోఈల్లో అడ్మిషన్లకు మార్చి 13న అర్హత పరీక్ష
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలో ఉన్న సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సల్టెన్సీ) కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లకు సంబంధించి మార్చి 13న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థుల హాల్‌టికెట్లు ఇప్పటికే సొసైటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, పరీక్ష రోజున ఉదయం 9గంటలకల్లా అభ్యర్థులు రిపోర్టు చేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
Published date : 09 Mar 2021 04:44PM