Skip to main content

సీఏఎస్ స్పెషలిస్ట్‌లకు నేడు, రేపు కౌన్సెలింగ్

సాక్షి, అమరావతి: వైద్యవిధాన పరిషత్ పరిధిలో పనిచేసేందుకు నియామకాలు జరుపుతున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్)లకు బుధ, గురువారాలు ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ జరుగనుంది.
ఈ ప్రక్రియ అనంతరం వారికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డా.రామకృష్ణారావు మంగళవారం తెలిపారు. మొత్తం 692 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. వీరికి సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
Published date : 02 Sep 2020 12:18PM

Photo Stories