‘సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలను రద్దు చేయండి’
Sakshi Education
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి మళ్లీ పెరుగుతుండడంతో ప్రజల్లో భయాందోళనలకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో వార్షిక బోర్డు పరీక్షలను రద్దు చేయాలని సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ 10, 12వ తరగతుల విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ‘‘క్యాన్సల్ బోర్డు ఎగ్జామ్స్2021’’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
సీబీఎస్‌ఈ 2021 సిలబస్, స్టడీమెటీరియల్, బిట్‌బ్యాంక్స్, కెరీర్ గైడెన్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
మే నెలలో బోర్డు పరీక్షలు జరగాల్సి ఉంది. వీటిని రద్దు చేయాలని, అది సాధ్యం కాకపోతే ఆన్‌లైన్ లో నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. అయితే, కరోనా నివారణ కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని బోర్డు పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ అధికారులు చెబుతున్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా ఉన్నప్పుడు మిగిలిన బోర్డు పరీక్షలను రద్దు చేశారని విద్యార్థులు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు నిత్యం లక్షకుపైగా కేసులు నమోదవుతున్న దశలో పరీక్షలు నిర్వహించడం ఏమిటని ఆక్షేపిస్తున్నారు.

Published date : 09 Apr 2021 02:49PM