‘సెట్ల’కు కన్వీనర్ల ఖరారు
Sakshi Education
సాక్షి, అమరావతి/బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ సహా పలు సెట్లకు కన్వీనర్లను ఉన్నత విద్యామండలి జనవరి 11 (శనివారం)నఖరారు చేసింది.
ఈ మేరకు సెట్ల కన్వీనర్ల పేర్లను సెట్స్ ప్రత్యేక అధికారి సుధీర్‌రెడ్డి విడుదల చేశారు. ఏపీ ఎంసెట్-2020 కన్వీనర్‌గా డాక్టర్ విప్పర్తి రవీంద్ర నియమితులయ్యారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా జేఎన్‌టీయూకే సివిల్ ప్రొఫెసర్, డెరైక్టర్ ఆఫ్ అకడమిక్ ఆడిట్‌గా ఉన్నారు.
సెట్ల వారీగా కన్వీనర్లు
సెట్ల వారీగా కన్వీనర్లు
- ఎంసెట్: ప్రొఫెసర్ వి.రవీంద్ర- జేఎన్టీయూ కాకినాడ
- ఈసెట్: ప్రొఫెసర్ పి.ఆర్.భానుమూర్తి- జేఎన్టీయూ అనంతపురం
- ఐసెట్: ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరెడ్డి- శ్రీవేంకటేశ్వర వర్సిటీ
- పీజీఈసెట్: ప్రొఫెసర్ పి.శ్రీనివాసరావు- ఆంధ్రా యూనివర్సిటీ
- లాసెట్: ప్రొఫెసర్ జ్యోతి విజయకుమార్- శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీ
- ఎడ్ సెట్: ప్రొఫెసర్ ఆర్.శివప్రసాద్- ఆంధ్రా యూనివర్సిటీ
- పీఈసెట్: డా.జాన్సన్- నాగార్జున వర్సిటీ
- ఆర్ సెట్: ప్రొఫెసర్ వి.శ్రీకాంత్‌రెడ్డి- శ్రీవేంకటేశ్వర వర్సిటీ
- బీఆర్క్ సెట్: వై.అబ్బులు- ఆంధ్రా యూనివర్సిటీ
Published date : 13 Jan 2020 03:50PM