సెప్టెంబర్ 5న జగనన్న విద్యా కానుక ప్రారంభం!
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జగనన్న విద్యా కానుక’ పథకం సెప్టెంబర్ 5న లాంఛనంగా ప్రారంభం కానుంది.
ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ కిట్లను అందిస్తారు. ఈ కిట్లలో మూడు జతల దుస్తులు, నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, ఒక జత షూ, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్ ఉంటాయి. ఎయిడెడ్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు, గుర్తింపు పొందిన మదర్సాలలోని విద్యార్థులు కూడా దీనికి అర్హులే.
Published date : 26 Aug 2020 01:22PM