సెప్టెంబర్ 10 నుంచి ఏపీఐసెట్-2020
Sakshi Education
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 10, 11 తేదీల్లో ఏపీఐసెట్-2020 ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఐసెట్ కన్వీనర్ ఎం.శ్రీనివాసరెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఏపీఐసెట్-2020ప్రాక్టీస్ టెస్ట్స్, స్టడీ మెటీరియల్, గెడైన్స్... ఇతర అప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి. https://www.sakshieducation.com/ICET/Index.html
ఎస్‌వీ యూనివర్సిటీ నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు 64,884 మంది దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. 45 పట్టణాల్లో 75 పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ ద్వారా ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు ఉంటాయన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించమని చెప్పారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్ బాటిల్ వెంట తెచ్చుకోవాలని తెలిపారు.

Published date : 08 Sep 2020 07:04PM