సైనిక పాఠశాలల్లో ‘ఎంట్రన్స్’కు గడువు డిసెంబర్ 3 వరకు పెంపు
Sakshi Education
విజయనగరం రూరల్: ఆల్ ఇండియా సైనిక పాఠశాలల్లో 6, 9 తరగతుల్లో ప్రవేశానికి.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 3 వరకు గడువు పెంచినట్టు సైనిక పాఠశాల ప్రిన్సిపాల్, వింగ్ కమాండర్ సీఎస్ భానుప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు.
గత ప్రకటనలో దరఖాస్తునకు చివరి తేదీ నవంబర్ 19తో ముగియగా, మరో 15 రోజులు గడువు తేదీని పొడిగించామని, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం లభించిందని వివరించారు.
Published date : 21 Nov 2020 04:40PM