రెండో విడత ‘నాడు–నేడు’కు రూ.4,446 కోట్లు మంజూరు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమం రెండోదశ కింద 16,345 ప్రభుత్వ విద్యాసంస్థల్లో రూ.4,446 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. 2021–22 విద్యా సంవత్స రంలో 10 కాంపొనెంట్ల కింద ఈ మౌలిక వసతు లను కల్పిస్తారు. మొదటిదశ కింద 2019–20 విద్యా సంవత్సరంలో 15,715 పాఠశాలల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. రెండోదశలో చేపట్టే పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
స్కూళ్లు, ఇతర సంస్థల సంఖ్య, ఖర్చు అయ్యే నిధులు ఇలా..
స్కూళ్లు, ఇతర సంస్థల సంఖ్య, ఖర్చు అయ్యే నిధులు ఇలా..
కేటగిరీ | సంస్థలు | ఖర్చు (రూ.కోట్లలో) |
ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు (ఇందులో అప్పర్ ప్రైమరీవి 822) | 9,907 | 1,760 |
గురుకులాలు సహ హైస్కూళ్లు | 2,771 | 1,629 |
జూనియర్ కాలేజీలు | 473 | 331 |
హాస్టళ్లు | 1,668 | 466 |
గురుకుల స్కూళ్ల హాస్టళ్లు | 391 | 118 |
డైట్, ఐఏఎస్‌ఈ, సీటీఈ | 17 | 21 |
ఎంఆర్‌సీలు | 672 | 67 |
భవిత కేంద్రాలు | 446 | 54 |
మొత్తం | 16,345 | 4,446 |
Published date : 31 Mar 2021 04:31PM