రేపటి నుంచి టెన్త్ విద్యార్థులు, టీచర్లకు వేసవి సెలవులు
Sakshi Education
సాక్షి, అమరావతి: పదో తరగతి విద్యార్థులకు పాఠశాల విద్యా శాఖ మే 1వ తేదీ నుంచి 31 వరకు వేసవి సెలవులను ప్రకటించింది.
అన్ని యాజమాన్యాల పాఠశాలల టెన్త్ విద్యార్థులకు టీచింగ్ క్లాసెస్ను రద్దు చేసింది. ఈ నెల 30న పాఠశాలలకు చివరి పని దినం. పదవ తరగతి పరీక్షల కోసం మే 1 నుంచి 31వ తేదీ వరకు అందరు విద్యార్థులు ఇంటి దగ్గరే ఉండి సన్నద్ధం కావాలి.
ఏపీ పదో తరగతి 2021 పబ్లిక్ పరీక్షల టైం టేబుల్, స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్ గైడెన్స్, మోడల్ క్వశ్చన్ పేపర్లు, బిట్ బ్యాంక్స్, కెరీర్గైడెన్స్.. ఇతర తాజా అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
పదో తరగతి బోధించే ఉపాధ్యాయులు అందరూ డిజిటల్ ప్లాట్ ఫామ్లు ఉపయోగించి విద్యార్థులకు తగురీతిన సహకరించాలి. జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం కోసం, మార్గదర్శకత్వం కోసం టెన్త్ ఉపాధ్యాయులు పాఠశాలకు తప్పనిసరిగా హాజరుకావాలి. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
చదవండి: టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించకుంటే భవిష్యత్తులో నష్టపోతారు: సీఎం వైఎస్ జగన్

Published date : 30 Apr 2021 03:04PM