రేపే ఏపీసెట్- 2020 పరీక్ష
Sakshi Education
ఏయూ క్యాంపస్ (విశాఖ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ల పోస్టులకు అర్హత పరీక్ష ఏపీసెట్-2020 ఆదివారం నిర్వహించనున్నారు.
దీనికి సంబంధించి ఏపీసెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీసెట్‌కు 35,862 మంది దరఖాస్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు నగరాల్లో 76 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 30 సబ్జెక్టులలో పరీక్ష జరుగుతుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు నేరుగా హాజరు కావచ్చు. ఆదివారం ఉదయం 9.30 నుంచి 12.30 వరకు జరిగే ఈ పరీక్షకు గంట ముందుగా కేంద్రాలలోకి అనుమతిస్తారు. పూర్తి సమాచారం ఏపీసెట్ వెబ్‌సైట్ www.apret.net.in నుంచి పొందవచ్చు.
Published date : 19 Dec 2020 04:11PM