Skip to main content

రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజీ దరఖాస్తు గడువు నవంబర్ 15 వరకు పొడిగింపు

సాక్షి, అమరావతి: రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజీ (డెహ్రాడూన్) ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును నవంబర్ 15 వరకు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. డిసెంబర్ 1, 2 తేదీల్లో జరగాల్సి ఉన్న ప్రవేశ పరీక్షను కూడా కోవిడ్ కారణంగా వాయిదా వేసింది.
దరఖాస్తు సమర్పణలో కొన్ని మినహాయింపులు ఇచ్చారు. హెడ్మాస్టర్, ప్రిన్సిపాల్ సంతకం చేసిన విద్యార్హత ధ్రువపత్రాలు, రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన నివాస ధ్రువపత్రాల నుంచి మినహాయింపునిచ్చారు.
Published date : 03 Sep 2020 12:16PM

Photo Stories