ఫ్రెషర్స్ నియామకాలకు కార్పొరేట్ కంపెనీలు సై: టీమ్‌లీజ్ సర్వే
Sakshi Education
న్యూఢిల్లీ: ఫ్రెషర్లను నియమించుకోవడానికి కార్పొరేట్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.
ఈ నేపథ్యంలో వివిధ విభాగాల్లో ఎంట్రీ లెవల్ నిపుణుల నియామకం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ సర్వే తెలిపింది. ప్రతిభగల ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి 15 శాతం కార్పొరేట్ కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. 14 నగరాల్లో టీమ్‌లీజ్ చేపట్టిన ‘కెరీర్ ఔట్‌లుక్ రిపోర్ట్ ఫిబ్రవరి-ఏప్రిల్ 2021’లో 18 రంగాలకు చెందిన 815 కంపెనీలు పాలుపంచుకున్నాయి. బిజినెస్ డెవలప్‌మెంట్, సేల్స్, గ్రాఫిక్ డిజైనర్స్, డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్స్, కంటెంట్ రైటర్స్, వెబ్ డెవలపర్ వంటి ఉద్యోగాలు ప్రధానంగా ఫ్రెషర్లకు అందుబాటులో ఉంటున్నాయి
Published date : 18 Feb 2021 04:28PM