`ఫోరెన్సిక్ సైన్స్` సైంటిఫిక్ అసిస్టెంట్ ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతిః ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది.
రాష్ట్రంలోని 24 కేంద్రాల్లో ఈ నెల 6న నిర్వహించిన రాత పరీక్షకు 8,127 మంది హాజరు కాగా, 3,487 మంది అర్హత సాధించారు. వారిలో పురుషులు 2,368 మంది, మహిళలు 1,119 మంది ఉన్నారు. రాత పరీక్ష తుది ‘కీ’ www.slprb.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్ కాపీలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జవాబు పత్రాల పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకు రూ.1,000 ఫీజు చెల్లించి, వెబ్‌సైట్‌లో పొందుపరచిన దరఖాస్తును భర్తీ చేసి 20వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు వెరిఫికేషన్ చేసుకోవాలి. అదేవిధంగా అభ్యర్థులు దరఖాస్తులో చేర్పులు, మార్పులు చేసుకోవాలని భావిస్తే ఈ నెల 19 నుండి 21వ తేదీలోపు apslprb.fslobj@gmail.com మెయిల్ ఐడీ ద్వారా విజ్ఞప్తి చేయొచ్చని రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటనలో తెలిపింది.
Published date : 19 Dec 2020 04:13PM