Skip to main content

ఫిబ్రవరి 3వ వారంలోప్రతి విద్యార్థికి రూ.20 వేలు వసతి సాయం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ‘జగనన్న వసతి దీవెన’పథకం కింద 2019-20 ఆర్థిక సంవత్సరంలో 11,61,244 మంది విద్యార్థులకు రూ.2,300 కోట్లు వెచ్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటికే ఈ పథకం కింద అర్హత పొందిన విద్యార్థులు 10,65,357 మంది ఉన్నారు. ఇటీవల నిర్వహించిన వైఎస్సార్ నవశకం సర్వేలో మరో 95,887 మంది విద్యార్థులు ఈ పథకం కింద లబ్ధి పొందటానికి అర్హులని ప్రభుత్వం గుర్తించింది. మొత్తంగా 11,61,244 మంది వసతి దీవెన పథకానికి అర్హులయ్యారు. వీరందరికీ వసతి దీవెన కార్డులను సిద్ధం చేసిన ప్రభుత్వం.. సదరు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫిబ్రవరి మూడో వారంలో నగదు జమ చేయాలని నిర్ణయించింది.

ఒక్కో విద్యార్థికి రూ.20 వేలు..
స్టూడెంట్ మేనేజ్‌మెంట్ హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థుల్లో ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.20 వేల చొప్పున ఇస్తారు. ఈ సొమ్ము నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతుంది. ఇంతకుముందు చాలీచాలని స్కాలర్‌షిప్‌లతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఏటా ఒక్కో విద్యార్థికి వసతి సౌకర్యాల నిమిత్తం రూ.20 వేలు తప్పనిసరిగా అవసరమవుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో అంచనా వేశారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు ఈ పథకం అమలులోకి వచ్చింది. గత ప్రభుత్వం మెయింటెనెన్స్ ఫీజుల (ఎంటీఎఫ్) కింద సంవత్సరానికి రూ.800 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం రూ.2,300 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.1,500 కోట్ల వరకు అదనపు భారం పడుతుంది. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ఎంత భారమైనా భరించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు కష్టాలు తప్పనున్నాయి.
Published date : 03 Feb 2020 04:49PM

Photo Stories