ఫిబ్రవరి 23న కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మాప్అప్ కౌన్సెలింగ్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మాప్అప్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీగా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 23న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. ఖాళీ సీట్ల వివరాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో (www.knruhs.telangana.gov.in) పొందుపరిచామని, మరిన్ని వివరాలకు వెబ్ సైట్‌ను సందర్శించాలని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి.
Published date : 23 Feb 2021 05:05PM