Skip to main content

ఫిబ్రవరి 10 నుంచి డీఈఈసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్

సాక్షి, హైదరాబాద్: డీఈఈసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు డీఈఈసెట్ కన్వీనర్ కృష్ణారావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మొదటి, రెండో దశ కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాని, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోని వారికి మాత్రమే ఈసారి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి 13 వరకు విద్యార్థులు తమ జిల్లాల్లోని జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో (డైట్) సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 22వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. సీట్లు పొందిన వారు 22వ తేదీ నుంచి 24వ తేదీ మధ్య ఫీజు చెల్లించాలని, 26వ తేదీన సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయాలని వివరించారు.
Published date : 09 Feb 2021 04:00PM

Photo Stories