ఫిబ్రవరి 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు ప్రారంభం: ఆదిమూలపు సురేష్
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలలు తెరుచుకోనున్నాయి.
ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎలిమెంటరీ స్కూళ్లలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. తరగతి గదిలో 20 మంది విద్యార్థులుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతుల నిర్వహణ ఉండాలని సూచించారు. సరిపడా తరగతి గదుల్లేని చోట రోజు మార్చి రోజు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. తల్లిదండ్రుల లిఖితపూర్వక హామీతో విద్యార్థులను అనుమతించాలని మంత్రి సూచించారు.
Published date : 30 Jan 2021 02:48PM