పత్యక్ష బోధనకు మేము సిద్ధంగా ఉన్నాం..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తే, పాఠశాలలను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రాజభాను చంద్రప్రకాశ్ పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి లేఖ పంపారు. కనీసం 9, 10వ తరగతి విద్యార్థులకై నా ప్రత్యక్ష తరగతులను ప్రారంభించాలన్నారు. కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలకు అవసరమయ్యే సానిటేషన్ మెటీరియల్, మాస్కులు, ఇతర సామగ్రి అందజేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశుభ్రత విధులు నిర్వహించే సర్వీస్ పర్సన్లను నియమించాలని ఆ లేఖలో కోరారు.
Published date : 07 Dec 2020 04:50PM