పట్టుదల అంటే అలా ఉండాలి!!
Sakshi Education
సామాన్యంగా అందరూ ఏదో ఒక పనికి శ్రీకారం చుడతారు. పనిని ప్రారంభించడం గొప్ప విషయం కాదు.
అయితే దానిని పూర్తిచేయగలగడమే గొప్పదనం. అయితే ఇలా పనిచేసేవారు మూడు రకాలుగా ఉంటారు. వారిలో ఉత్తములు పనిని ప్రారంభించి, ఎన్ని విఘ్నాలు వచ్చిన ఆపకుండా దీక్షతో పూర్తి చేస్తారు.ఇక మధ్యములు పనులను ప్రారంభించి కొన్నిరోజులవరకు బాగానే కొనసాగిస్తారు. అయితే ఏదో ఒకరోజు మధ్యలో దాన్ని వదిలేస్తారు..ఇక మరో వర్గం ఉంటుంది. వీరికి నిలువెల్లా బద్ధకం. సోమరిపోతుతనం. అందువల్ల అసలు మంచి చేయాలని అను కోరు.. ఒకవేళ అనుకున్న దాన్ని వాయిదాలు వేస్తూ కాలం వృథా చేస్తారు. ఏకలవ్యుడు కోయ తెగకు చెందినవాడు. విలువిద్య నేర్చుకోవాలనే ఆసక్తితో ద్రోణాచార్యుడి దగ్గరకు వెళతాడు. తన కోరికను వెల్లడిస్తాడు. అయితే ఈ విద్యను కేవలం రాజకుంటుంబాలకు మాత్రమే నేర్పిస్తానని చెప్పడంతో ఏకలవ్యుడు వెనుదిరుగుతాడు..అయినా ఏమాత్రం నిరాశచెందక మట్టితో ద్రోణాచార్యుని ప్రతిమను ఏర్పాటు చేసుకొని విలువిద్యను నేర్చుకొని, ద్రోణాచార్యుని శిష్యుల కంటే మేటి విలుకాడిగా ఎదుగుతాడు. పట్టుదల అంటే అలా ఉండాలి. అది ఉత్తముల లక్షణం. ఇక విద్యార్థులు బడికి వెళ్లి చదువుకోవడానికి, మార్కులు తెచ్చుకోవడానికే పరిమితం కాకూడదు. క్రమశిక్షణతోపాటు శీలాన్ని (కేరెక్టర్)ను అభివృద్ధి చేసుకోవాలి. ఈ రెండింటికీ ప్రతీకగా నిలవాలి. తోటివిద్యార్థులకు ఆదర్శంగా నిలబడాలి. అప్పుడే ఈ విద్యకు అర్థం. విద్యలేని వాడు వింత పశువైతే చదువుకోని కూడా సంస్కారం లేనివారిని ఏమని పిలవాలి?
Published date : 23 Jan 2020 02:25PM