ప్రవేశ పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే పూర్తిచేయాలి: ఆదిమూలపు సురేష్
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఎంసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం సజావుగా పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు.
కోవిడ్–19 ప్రోటోకాల్‌ను పాటిస్తూ విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ తగు చర్యలు చేపట్టాలన్నారు. ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఆయా సెట్ల కన్వీనర్లు, ఇతర అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు.
పరీక్షల తేదీలు ఇలా..
- సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన మేరకు నిర్ణీత సమయంలోగా, యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనలను అనుసరించి ప్రవేశ పరీక్షలతో పాటు, ఆయా కోర్సుల్లో ప్రవేశాలు, ఫైనలియర్ డిగ్రీ పరీక్షలు పూర్తిచేయాలని సూచించారు.
- ప్రవేశ పరీక్షల నిర్వహణ సమయంలో విద్యార్థులు ప్రోటోకాల్ నిబంధనలు పాటించేలా చూడాలని, మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, పరీక్ష కేంద్రాల్లో భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
- ఈ సందర్భంగా ఏ ప్రవేశ పరీక్షకు ఎంతమంది విద్యార్థులు హాజరుకానున్నారు? ఏర్పాట్లు ఏమేమి చేపట్టాలి? అన్న అంశాలను మంత్రి సమీక్షించారు.
పరీక్షల తేదీలు ఇలా..
పరీక్ష | అభ్యర్థులు | తేదీ |
ఎంసెట్ (ఇంజినీరింగ్) | 1,84,874 | సెప్టెంబర్ 17–25 |
ఎంసెట్ (అగ్రి,మెడికల్) | 87,552 | సెప్టెంబర్ 17–25 |
ఈసెట్ | 36,849 | సెప్టెంబర్ 14 |
ఐసెట్ | 64,839 | సెప్టెంబర్ 10, 11 |
పీజీఈసెట్ | 28,050 | సెప్టెంబర్ 28–30 |
లాసెట్ | 17,340 | అక్టోబర్ 1 (మధ్యాహ్నం) |
ఎడ్‌సెట్ | 14,357 | అక్టోబర్ 1 (ఉదయం) |
పీఈసెట్ | 2,808 | అక్టోబర్ 2–5 |
Published date : 28 Aug 2020 08:19PM