Skip to main content

ప్రశాంతంగా ఏపీసెట్ 2020... 73.96 శాతం హాజరు

ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష ఏపీసెట్-2020 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 73.96 శాతం మంది హాజరైనట్లు ఏపీసెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు తెలిపారు.
పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 35,862 మంది దరఖాస్తు చేయగా 26,525 మంది హాజరయ్యారన్నారు. కోవిడ్ నియమావళిని అనుసరిస్తూ పరీక్షల నిర్వహణ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. విశాఖలోని పలు పరీక్ష కేంద్రాలను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి పరిశీలించారు.
Published date : 21 Dec 2020 03:32PM

Photo Stories