ప్రపంచస్థాయి శాస్త్రవేత్తగా.. మన ప్రొఫెసర్!
Sakshi Education
సాక్షి, హన్మకొండ (వరంగల్ జిల్లా): అమెరికాలో శాస్త్రవేత్తగా రాణించడంతో పాటు గుర్తింపు పొందిన శాస్త్రవేత్తగా ఎదిగారు పూర్వవరంగల్ జిల్లావాసి డాక్టర్ దూదిపాల సాంబరెడ్డి.
ఇటీవల ఆయనను అసోసియేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ ఫార్మసీ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ పురస్కారంతో సత్కరించింది. వరంగల్ రూరల్ జిల్లా నడికుడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ దూదిపాల సాంబరెడ్డి కేయూలో బీ ఫార్మసీ పూర్తయ్యాక పంజాబ్ యూనివర్సిటీలో ఎం ఫార్మసీ, పీహెచ్‌డీ చేశారు. అనంతరం అమెరికా వెళ్లి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వాషింగ్టన్‌లో పోస్ట్ డాక్టరల్ చేశాడు. దీని తర్వాత నార్త్ కరోలినా యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. తర్వాత టెక్సాస్‌లోని ఎ అండ్ ఎం యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా చేరారు. ఇక్కడే పరిశోధనలకు పదును పెట్టారు. తన మేథస్సుతో మానవ మెదడులో ఉండే న్యూరో స్థిరాయిడ్ పనిని, ఆకృతిని కనుగొన్నారు. మానవాళికి ఉపయోగపడే రెండు ఔషధాలను కనుగొన్నారు. మెదడు వ్యాధులకు సంబంధించి బ్రెక్సనోలోన్, మూర్ఛవ్యాధి నివారణకు గెనాక్సిలోన్ ఔషధాన్ని కనుగొని ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు.
విజయవాడలో అవార్డు ప్రదానం
విజయవాడలో డిసెంబర్ 20, 21, 22 తేదీలలో జరిగిన అసోషియేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ ఫార్మ సీ అంతర్జాతీయ స్థాయి సదస్సులో డాక్టర్ సాంబరెడ్డికి ప్రతిష్టాత్మక లైఫ్ టైం అచీవ్‌మెంట్ పురస్కారం అందజేశారు. ఇక సాంబరెడ్డి వ్యాసాలు ఎంతో ప్రాచుర్యా న్ని పొందాయి. గత 24 సంవత్సరాల నుంచి మెద డు జబ్బులపై అధ్యయనం చేస్తున్నారు. మూర్ఛ వ్యాధికి ఔషధం కనుగొన్నారు. మెదడు దెబ్బల నుంచి న్యూరోలాజికల్ జబ్బులు రాకుండా ఒక కొత్త ‘ఏపిజెనెటిక్’ చికిత్స విధానాన్ని ఇటీవలే ప్రకటించారు. ఈ విధానాలు విశ్వవాప్తంగా వేలాది మంది రోగులకు ఉపయోగపడుతున్నాయి.
సామాజిక స్పృహ కూడా..
సాంబరెడ్డి ఒక సామాజిక సృ్పహ కలిగిన వ్యక్తిగా వైద్య రంగంలో తాను పొందిన జ్ఞానాన్ని, ప్రపంచ మానవాళికి ఉపయోగపడేలా మెదడు, నాడి చికిత్స విధానాలకు సరికొత్త నాంది పలికారు. ఫైట్స్, తల దెబ్బలు, న్యూరోటాక్సిసిటీ, ఇతర మెదడు జబ్బులకు కొత్త మందులు కనిపెట్టి న్యూరోలాజికల్ రోగులకు సృజనాత్మక చికిత్స అందించి జబ్బుల నియంత్రణకు సహాయం చేయడమే ధ్యేయంగా మలుచుకున్నారు.
పురస్కారం అందుకోవడం అదృష్టం
ఇంతటి ప్రతిష్టాత్మకమైన ‘లైఫ్ టైం పురస్కారం’ అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ బిడ్డగా ఇంతటి గౌరవం నాకు ఇవ్వడానికి సహకరించిన వారందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఈ పురస్కారానికి ఇంకా ఎంతో వన్నె తెచ్చి, రానున్న కాలంలో మరెన్నో శాస్త్ర విజయాలు సాధించి తెలంగాణ గడ్డకి మన భారతీయులందరికీ కీర్తి ప్రతిష్టలు పెంపొం దించి మన పిల్లలకు మార్గదర్శిగా నిలిచేందుకు యత్నిస్తా.
- డాక్టర్ సాంబరెడ్డి, ఏ అండ్ ఎం

Published date : 10 Jan 2020 04:52PM