ప్రీస్కూల్ ఆన్‌లైన్ పాఠాలకు ఏడాది పూర్తి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను ఆన్‌లైన్ పద్ధతిలో అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ టీశాట్ ద్వారా తలపెట్టిన ఆన్‌లైన్ బోధనకు ఏడాది పూర్తయింది.
లాక్‌డౌన్‌తో అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడటంతో ఇంట్లోనే చిన్నారులకు ఆన్‌లైన్ పద్ధతిలో బోధన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ పేరిట రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో ప్రత్యేక పేజీ తెరిచింది. ఇందులో ఇంగ్లి‹Ù, తెలుగు పద్యాలు, సాధారణ ప్రశ్నలు, ఇండోర్ గేమ్స్, క్రియేటివ్ కార్యకలాపాలు, ప్రీ న్యూమరసీ కాన్సెప్ట్స్, కథలు (ఆడియో/వీడియో), పాటలు తదితర ఆసక్తికర అంశాలను వీడియో పద్ధతిలో పొందుపర్చారు. ప్రీస్కూల్ ఆన్‌లైన్ విధానాన్ని ప్రారంభించి ఏడాది పూర్తి కావడంతో గురువారం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి డి.దివ్య, జాయింట్ డైరెక్టర్ లక్ష్మీదేవి టీశాట్ ప్రత్యక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడాదిలో 271 ఎపిసోడ్‌లు ప్రదర్శించినట్లు వివరించారు. క్షేత్రస్థాయిలో 72% మంది లబ్ధిదారులు వీక్షించేలా అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులు కృషి చేశారని, వాటిని గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు వీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Published date : 18 Jun 2021 02:00PM