పరీక్షల వాయిదాకు ఆదేశాలు ఇవ్వలేం: హైకోర్టు
Sakshi Education
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో పీజీ, యూజీ ఇతర డిప్లొమో కోర్సులకు పరీక్షలు నిర్వహించకుండా, విద్యార్థులను తదుపరి సెమిస్టర్లకు ప్రమోట్ చేసే దిశగా ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
పరీక్షల వాయిదాపై విద్యార్థి సంఘం ఎలా పిటిషన్ దాఖలు చేస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. పరీక్షలు వాయిదా కావాలంటే సంబంధిత విద్యార్థులే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి ఉంటుందని తెలిపింది. యూజీసీ నిబంధనలకు లోబడి, పరీక్షల వాయిదా కోరేందుకు సంబంధిత అధికారులను ఆశ్రయించవచ్చునని విద్యార్థులకు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ దొనాడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
Published date : 21 Aug 2020 02:02PM