Skip to main content

పరీక్షా పే చర్చ-2020కు 19 మంది తెలంగాణ విద్యార్థులు

సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జనవరి20న జరిగే పరీక్షా పే చర్చ-2020 కార్యక్రమానికి తెలంగాణ నుంచి 19 మంది విద్యార్థులకు అవకాశం వచ్చింది.
ఈమేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్ జనవరి 18 (శనివారం)నవివరాలు వెల్లడించారు. ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షా పే చర్చలో దేశవ్యాప్తంగా 2,200 మంది విద్యార్థులు పాల్గొంటారని, వీరితో ప్రధాని నేరుగా ముచ్చటిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమం దూరదర్శన్, ఆకాశవాణి ద్వారా ప్రత్యక్ష ప్రసారం అవుతుందని, పాఠశాల విద్యార్థులంతా ఈ కార్యక్రమాన్ని చూసేలా ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆయన ఆదేశాలు జారీచేశారు.
Published date : 20 Jan 2020 03:00PM

Photo Stories