ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు..పీఆర్సీ పై సీఎం కీలక వ్యాఖ్యలు
Sakshi Education
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. పీఆర్సీ అంశంపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
శాసనసభ వేదికగానే రాబోయే రెండు, మూడు రోజుల్లో గౌరవప్రదమైన పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల మీద తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుందని.. వారిపై తమకెంత ప్రేమ ఉందో గత పీఆర్సీతోనే చూపించామని సీఎం కేసీఆర్ అన్నారు.
తెలంగాణ ఉద్యోగులకు ఇండియాలో తాము అత్యధిక జీతాలు పొందుతామని చెప్పుకునే విధంగా జీతాలు ఇస్తామని చెప్పాం.. ఇప్పుడు ఆ హామీని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. తాను పీఆర్సీ ప్రకటించిన తర్వాత ఉద్యోగులు తప్పకుండా హర్షం చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పీఆర్సీ ప్రకటిస్తామన్నారు. కొద్దిరోజుల క్రితం ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కేసీఆర్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెరుగైన ఫిట్మెంట్ తో పీఆర్సీని ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించినట్లు గతంలో ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.

Published date : 18 Mar 2021 06:11PM