Skip to main content

ప్రాథమిక పాఠశాలల్లో పీఎస్‌హెచ్‌ఎం పోస్టుల భర్తీకి మోక్షమెప్పుడో?

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల (పీఎస్‌హెచ్‌ఎం) పోస్టులకు మోక్షం లభించడం లేదు.
10 వేల ప్రాథమిక పాఠశాలల్లో పీఎస్‌హెచ్‌ఎంలను నియమిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మూడు నెలల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్‌ ప్రకటన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలు, ఆయా స్కూళ్లలో ఇప్పటికే ఉన్న హెడ్‌ మాస్టర్‌ పోస్టులు, తాజాగా ఇంకా ఎన్ని పోస్టులు మంజూరు చేయాలన్న అంశాలపై వివరాలను సేకరించింది. దీని ప్రకారం రాష్ట్రంలోని 18,217 ప్రాథమిక పాఠశాలల్లో 4,429 లో–ఫిమేల్‌ లిటరసీ (ఎల్‌ఎఫ్‌ఎల్‌) హెడ్‌ మాస్టర్‌ పోస్టులు ఉన్నట్లు తేల్చింది. సీఎం కేసీఆర్‌ 10 వేల స్కూళ్లలో హెడ్‌ మాస్టర్‌ పోస్టులను ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో మరో 5,571 పోస్టులను మంజూరు చేయాల్సి ఉంటుందని, ఏయే జిల్లాల్లో ఎన్ని పోస్టులను మంజూరు చేయాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వాటిపై ఎలాంటి నిర్ణయం లేకుండాపోయింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 4,429 ప్రధానోపాధ్యాయ పోస్టులు పోగా, మిగతా పోస్టులను మంజూరు చేస్తారా? లేదంటే వాటికి అదనంగా కొత్తగా 10 వేల పోస్టులను మంజూరు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

చదవండి: అభ్యర్థులకు టెట్‌ శాశ్వత వ్యాలీడిటీ సర్టిఫికెట్లు ఇవ్వండి: ఎన్సీటీఈ 

జిల్లాల వారీగా పోస్టులు..

జిల్లా

పాత పోస్టులు

కొత్త పోస్టులు

మొత్తం

ఆదిలాబాద్‌

484

613

1,097

హైదరాబాద్‌

168

205

373

కరీంనగర్‌

562

709

1,271

ఖమ్మం

460

581

1,041

మహబూబ్‌నగర్‌

580

731

1,311

మెదక్‌

426

535

961

నల్లగొండ

500

629

1,129

నిజామాబాద్‌

389

485

874

రంగారెడ్డి

369

466

835

వరంగల్‌

491

617

1,108

మొత్తం

4,429

5,571

10,000

Published date : 15 Jun 2021 03:09PM

Photo Stories