ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్య: విద్యార్థులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయ్..కష్టమే
Sakshi Education
సాక్షి, అమరావతి: పూర్తిగా ఆంగ్లంతో ముడిపడిన సాంకేతిక విద్యా పరిజ్ఞానాన్ని ప్రాంతీయ భాషల్లో విద్యార్థులకు అందించడం అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇంజనీరింగ్ కోర్సుల బోధనకు సరైన అధ్యాపకులు లేరని, పాఠ్య పుస్తకాలు తదితర మెటీరియల్ అసలే లేదని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. సిలబస్ రూపకల్పన, అనువాదం కూడా కష్టమేనని అంటున్నారు. విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు అంతగా అలవడవని, ఆంగ్ల నైపుణ్యానికి పూర్తిగా దూరమయ్యే ప్రమాదం కూడా ఉందని, అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంజనీరింగ్ తదితర సాంకేతిక వృత్తివిద్యా కోర్సులు ఇకపై తెలుగువంటి ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అధ్యక్షతన ఇటీవల జరిగిన ఒక అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎంపిక చేసిన కొన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)ల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటిని అమలు చేయనున్నారు. ప్రాంతీయ భాషలో బోధన వల్ల ఆయా రాష్ట్రాల్లో విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుందని కేంద్రం భావిస్తుండగా.. నిపుణులు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆంగ్ల నైపుణ్యం లేకపోతే ఉద్యోగాలు రావు
సాంకేతిక పరిజ్ఞానం సంబంధిత అంశాలన్నీ చాలావరకు ఆంగ్లంలోనే ఉన్నాయి. అలాగే కొత్త పరిశోధనలు, వాటి ఫలితంగా అందుబాటులోకి వచ్చే సాంకేతిక పరిజ్ఞానం కూడా అదే భాషలో ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ భాషల్లో ఆయా కోర్సులకు తగ్గ సిలబస్ రూపొందించడం పెద్ద సవాలుగా మారుతుంది. ప్రాంతీయ భాషల్లో సాంకేతిక కోర్సులు అభ్యసించిన వారికి ఆంగ్ల నైపుణ్యం లేకపోతే పెద్ద ఉద్యోగాలు దొరకవు. స్థానికంగా చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆ ప్రభుత్వ పరిధిలో ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో అమలు చేయడానికి అవకాశం ఉండొచ్చు. కానీ విద్య ఉమ్మడి సబ్జెక్టు అయినందున రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం లేనిదే అమలు చేసే అవకాశం ఉండదు.
- ప్రొఫెసర్ కె.రామ్మోహనరావు, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్
నైపుణ్యాలు అలవడవు
దేశానికి అత్యధిక విదేశీ ఆదాయం సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టుల ద్వారా అందుతోంది. విదేశీ ప్రాజెక్టులన్నీ ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. ఇంగ్లిష్ కమ్యూనికేషన్ ద్వారానే అవి సాధ్యం. ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ కోర్సులు వల్ల విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలతో పాటు ఆంగ్ల నైపుణ్యాలు కూడా అంతగా అలవడవు. చైనా వంటి దేశాలు కూడా సాంకేతిక కోర్సులకు వచ్చేసరికి ఆంగ్లాన్నే ఆశ్రయిస్తున్నాయి. ఇంటర్నేషనల్ జర్నల్స్ ఆంగ్లంలోనే ఉంటాయి. సాంకేతిక కోర్సులు ఆంగ్లంలో కొనసాగితేనే విద్యార్థులకు మేలు జరుగుతుంది
- ప్రొఫెసర్ ఎస్.ఎన్.తిరుమలరావు, సీఎస్‌ఈ హెచ్‌ఓడీ, నరసారావుపేట ఇంజనీరింగ్ కాలేజీ
తెలుగులో చెప్పాలంటే పదాలు దొరకవు..
టెక్నాలజీ కోర్సుల అంశాలన్నీ ఇంగ్లిష్‌తో ముడిపడి ఉన్నవే. కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఈసీఈ వంటి కోర్సుల సబ్జెక్టులలోని అంశాలను తెలుగులో చెప్పడం కష్టం. వాటిని తెలుగులో చెప్పడానికి పదాలు కూడా ఉండవు. ఒకవేళ కేంద్రానికి ప్రాంతీయ భాషల్లో ఈ కోర్సులు అందించాలన్న తపన ఉంటే అందుకు తగ్గ ఏర్పాట్లు, సన్నద్ధతతో ప్రారంభించాలి తప్ప హడావుడి పడితే సాధ్యమయ్యే పనికాదు.
- నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు
నిష్ణాతులైన అధ్యాపకులు దొరకరు

సాంకేతిక విద్య బోధించే అధ్యాపకులంతా ఆయా కోర్సులను ఇంగ్లిష్‌లోనే చదువుకొని ఈ వృత్తిలోకి వచ్చారు. ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో బోధించాలంటే.. ఆయా భాషల్లో ఇంజనీరింగ్, పీజీ, పీహెచ్‌డీ కోర్సులు చేసిన వారు దొరకరు. సిలబస్, పాఠ్యపుస్తకాలు, బోధకులు లేనప్పుడు కోర్సులు ఎలా నిర్వహించగలుగుతారు. టెక్నాలజీతో ఇప్పుడు ప్రపంచమంతా ఒకే గ్రామంగా మారిన తరుణంలో ఈ కోర్సులు ప్రపంచ భాషగా ఉన్న ఆంగ్లంలోనే ఉండాలి తప్ప ఇతర భాషల్లో బోధించడం వల్ల విద్యార్థులకు ప్రయోజనం ఉండదు.
- కె.సాంబశివరావు, డీన్ ఎన్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజయవాడ

Published date : 08 Dec 2020 04:27PM