పోటీ పరీక్షల కోసం ఆన్‌లైన్ ట్యూటర్స్ ప్రైడ్ యాప్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: విద్యా, ఉద్యోగ, స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన 20 రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే ‘ట్యూటర్స్ ప్రైడ్’ఆన్‌లైన్ యాప్‌ను హోంమంత్రి మహమూద్‌అలీ ప్రారంభించారు.
ఇంజనీరింగ్, మెడికల్, ఐ ఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ, ఎన్‌డీఏ, ఎన్‌టీఎస్‌ఈ లాంటి పోటీ పరీక్షల కోసం ‘ట్యూటర్స్ ప్రైడ్’రూ పొందించిన ఈ యాప్‌ను మినిస్టర్స్ క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, బీసీ కమిషన్ సభ్యు డు వకుళాభరణం కృష్ణమోహన్‌రావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాప్ చైర్మన్ అంకం, వైస్‌ప్రెసిడెంట్ వంశీపవన్‌లు మాట్లాడుతూ.. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి కానీ, 8978174444 ఫోన్ నంబర్‌కు కాల్ చేసి గానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలిపారు.
Published date : 20 Feb 2020 02:03PM