Skip to main content

పల్లెల్లో ఉపాధి భేష్ ..దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉపాధి అవకాశాలు

న్యూఢిల్లీ: కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకుంటోంది. దీంతో దేశవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి..

దేశవ్యాప్తంగా మేలో నిరుద్యోగిత రేటు 14.7 శాతం ఉండగా ఇప్పుడు 9.7శాతానికి పడిపోయింది. జూన్‌ 13న వరకు డేటాను పరిగణలోకి తీసుకుని ఈ డేటాను విడుదల చేశారు. తాజాగా చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడైనట్టు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమి సంస్థ తెలిపింది.

ఈ ఎఫెక్ట్‌తోనే..
పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా మెరుగయ్యాయి. రుతు పవనాలు ఎఫెక్ట్‌తో వ్యవసాయరంగంలో పనులు మొదలయ్యాయి. దీంతో ఇక్కడ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. పల్లె ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 8.23 శాతం ఉండగా పట్టణ ప్రాంతాల్లో 10.63 శాతంగా నమోదైనట్టు ఆ సర్వే పేర్కొంది.

ఇలా పుంజుకుంటోంది..
దేశవ్యాప్తంగా క్రమంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగిస్తుండటంతో మెల్లగా రవాణా రంగం కూడా మెరుగుపడుతోంది. ప్రజారవాణా, ఆఫీసుల్లో మళ్లీ కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి, గుగూల్‌ మొబిలిటీ సర్వీసెస్‌లో గణాంకాల్లో తేలింది. వర్క్‌ఫ్రం హోం నుంచి ఆఫీసులకు ఉద్యోగులు వెళ్తుండటంతో విద్యుత్‌ వినియోగం కూడా పెరిగింది. జులై చివరి నాటికి అన్‌లాక్‌ ప్రక్రియ పూర్తి కావొచ్చని... అప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా కోలుకుంటుందని బ్లూమ్‌బర్గ్‌ ఆర్థిక వేత్త అభిషేక్‌ గుప్తా అభిప్రాయపడ్డారు.

Published date : 16 Jun 2021 07:58PM

Photo Stories