Skip to main content

పిల్లలకు సత్రవర్తన ఎంతో ముఖ్యం!

ఎంత ఉన్నత విద్యావంతుడైనా ప్రవర్తన సరిగా లేకపోతే సమాజం గౌరవించదు. చదువుతోపాటు ప్రవర్తన సరిగా ఉంటే బంగారానికి తావి అబ్బినట్టు అవుతుంది.
బడికి వెళ్లే పిల్లల్లో ఎంతమంది ప్రవర్తన ఆదర్శప్రాయంగా ఉందనేది ఎంతో ముఖ్యం. మొకై ్క వంగనిది మానై వంగునా అనే సామెత తెలిసిందే. అందువల్ల పిల్లలను చిన్నతనం నుంచే సద్వర్తనులుగా తీర్చిదిద్దాలి. ఇక నమ్మకాల కంటే కూడా ‘ప్రవర్తన’అంటే మనం ఎలా పని చేస్తున్నామన్నది ముఖ్యం. జీవహింస పాపమని మన నమ్మకం. క్షమాగుణమే అత్యున్నతమని కొందరు వాదిస్తూ ఉంటారు. వీటిని ఆధారంగా చేసుకుని సమాజంలోని నేరస్థులని వదలివేస్తే, సమాజం అస్తవ్యస్తం అవుతుంది. ప్రభుత్వం సమాజంలోని దుర్మార్గులను, దుష్టశక్తులను దునుమాడడంలో ఏమాత్రం సంకోచించకూడదు. అలా సంకోచిస్తే మొత్తం సమాజమే నాశనం అవుతుంది. స్వామి వివేకానంద ఈ ఆదర్శాలను చూసి తికమకపడకుండా ఉండడం ఎలాగో వివరించారు. ‘‘అత్యున్నతమైన ఆదర్శం క్షమాగుణమేనని కర్మయోగి అయిన మనిషికి స్పష్టంగా తెలుసు. మనిషి ఆధీనంలో ఉండదగిన మహోన్నత శక్తియే ఈ క్షమాగుణమని కూడా కర్మయోగికి తెలుసు. మరొక వైపు దుర్మార్గాన్ని క్షమించకుండా మట్టుబెట్టడం కూడా ఈ క్షమాగుణమనే అత్యున్నతశక్తిని అభివ్యక్తీకరించే మార్గంలో ఒక మెట్టేనని కర్మయోగికి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే, ఆ అత్యున్నత ఆదర్శమైన క్షమాగుణాన్ని చేరుకోక ముందు మనిషి దుర్మార్గాన్ని ఎదుర్కోక తప్పదు, దాన్ని నిర్మూలించక తప్పదు. అదే కర్తవ్యం. ముందు మనిషిని పని చేయనివ్వండి. (దుర్మార్గం ఎదురైనప్పుడు) అవసరమైతే చెయ్యెత్తి కొట్టనివ్వండి! ఎప్పుడైతే మనిషి దుర్మార్గాన్ని ఎదుర్కోగల శక్తిని సంపాదిస్తాడో, అప్పుడు మాత్రమే అతడు క్షమాగుణాన్ని చూపడానికి అర్హత సాధించినవాడవుతాడు.’’ఈ ప్రపంచమనేది ఒక వ్యాయామశాల. ఇక్కడికి వచ్చేది కేవలం మనల్ని మనం బలంగా తయారుచేసుకోవడానికే. వ్యాయామశాలలోనే మనం నివసించము. అక్కడికి వెళ్ళి మనల్ని బలంగా చేసుకున్న తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాము. యుద్ధభూమిలో పోరాడడానికీ, రోజువారీ జీవితంలోని సవాళ్ళను ఎదుర్కోవడానికి తేడా లేదన్నదే గీత ఉవాచ. కాబట్టి, ఈ ప్రపంచంలో చావైనా, రేవైనా-పోరాడక తప్పదు.
Published date : 28 Jan 2020 02:39PM

Photo Stories