పీజీ ప్రవేశాల్లో ప్రభుత్వ డాక్టర్లకు కోటా: సుప్రీంకోర్టు
Sakshi Education
న్యూఢిల్లీ: మారుమూలప్రాంతాల్లో పనిచేసే ప్రభుత్వ డాక్టర్లకు పీజీ కోర్సుల అడ్మిషన్లలో రిజర్వేషన్ కల్పించే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ఇందుకు ఉన్న రిజర్వేషన్లలో ప్రత్యేక ప్రొవిజన్లు చేర్చుకునే చట్టబద్ధత రాష్ట్రాలకు ఉందని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలాంటి ప్రత్యేక కోటా ఇవ్వకూడదన్న ఎంసీఐ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ డాక్టర్లకు రిజర్వేషన్ సౌకర్యంపై తమిళనాడు మెడికల్ ఆఫీసర్ల సంఘం వేసిన దావాలో సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది.
Published date : 01 Sep 2020 03:57PM