పేదల ఇళ్లల్లో ‘జగనన్న అమ్మ ఒడి’ భరోసా!!
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం రాష్ట్రంలోని లక్షలాది నిరుపేద తల్లులకు కొండంత అండగా నిలుస్తోంది.
పేద పిల్లల చదువులపై భరోసా కల్పిస్తోంది. పిల్లల చదువులపై ఆందోళనతో ఉన్న మాతృమూర్తులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తోంది. దీంతో ప్రతి పేద తల్లి తన పిల్లలను పనికి కాకుండా బడికి పంపి వారికి బంగారు భవిత కల్పించేందుకు అడుగులు వేస్తోంది.
సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా..
దేశంలోనే మొట్టమొదటిసారిగా సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. అర్హురాలైన ప్రతి తల్లికీ ఈ పథకం వర్తించేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా.. ‘నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను’ అంటూ చెప్పిన ప్రతీ మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజం చేస్తున్నారు. ఇందులో భాగంగా.. నవరత్నాలలోని మరో కీలక హామీ ‘అమ్మ ఒడి’ని నెరవేర్చేందుకు ముందడుగు వేస్తున్నారు. ఈనెల 9న చిత్తూరులో ముఖ్యమంత్రి ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. చదువుకు పేదరికం ఎప్పుడూ ఆటంకం కాకూడదన్న మహోన్నత లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రకటించిన ఈ పథకం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. దీనివల్ల డ్రాపౌట్లు తగ్గడంతోపాటు పేద కుటుంబంలోని ప్రతి చిన్నారికి విద్య అందడం ద్వారా ఆయా కుటుంబాలు అభివృద్ధి సాధించగలుగుతాయన్నది పథకం లక్ష్యం.
రూ.6,455.80 కోట్లు మంజూరు
ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.6455.80 కోట్లు మంజూరు చేసింది. మొదటి విడతలో ఇప్పటివరకూ 42,80,823 మంది తల్లులను సర్కారు గుర్తించింది. ఒకొక్కరికి ఏటా రూ.15వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమచేయనుంది. మలివిడత పరిశీలన కొనసాగుతున్నందున ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. 43 లక్షల మందికి పైగా తల్లులకు దీని ద్వారా మేలు చేకూరనుంది. ఈ పథకం ద్వారా 81,72,224 మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుంది. 1 నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థులకు అమలుచేయాలని ముందు భావించినా తరువాత ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల తల్లులకూ ప్రభుత్వం వర్తింపజేస్తూ ఆదేశాలు జారీచేసింది. అన్ని ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలకూ ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నారు. 1 నుంచి 10 వరకు 72,77,387 మంది, ఇంటర్మీడియట్‌లో 8,94,837 మంది విద్యార్ధులకు ఈ లబ్ధి చేకూరనుంది. ఈ నేపథ్యంలో.. సర్కారు అందిస్తున్న సాయంతో పేద తల్లులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

Published date : 06 Jan 2020 04:09PM