పేదింటి విద్యార్థిని విదేశీ చదువుకు సినీనటుడు ప్రకాష్‌రాజ్ సహాయం
Sakshi Education
తాళ్లపూడి: పేదింటి పిల్ల విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు సాయపడి సినీనటుడు ప్రకాష్‌రాజ్ తన ఉదారత చాటుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన తిరిగిపల్లి సిరిచందన ఇటీవల బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసింది. ఆన్‌లైన్ ద్వారా పరీక్ష రాసి ఎంఎస్ చేయడానికి లండన్‌లోని మాంచెస్టర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సాల్‌ఫోర్డ్‌లో సీటు సాధించింది. పేదరికం కారణంగా విద్యార్థిని అడుగు ముందుకు వేయలేకపోయింది. ఈ విషయాన్ని కొందరు మిత్రులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రకాష్‌రాజ్ స్పందించారు. చందన చదువుకు అయ్యే ఖర్చును భరించడానికి ముందుకొచ్చారు. విద్యార్థిని తన తల్లితో కలిసి హైదరాబాద్ వెళ్లి ప్రకాష్‌రాజ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Published date : 05 Oct 2020 05:59PM