పాఠశాల విద్యలోనూ 30% సిలబస్ కుదింపుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యలోనూ సిలబస్‌ను తగ్గించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
కరోనా కారణంగా నష్టపోయిన పని దినాలను సర్దుబాటు చేసే అవకాశం లేకపోవడంతో 30 శాతం సిలబస్‌ను తగ్గించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) నేతృత్వంలో దీనికి సంబంధించిన కసరత్తును పూర్తి చేసి, సబ్జెక్టుల వారీగా రిపోర్టులు తయారు చేసి ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే 30 శాతం సిలబస్ కుదింపుపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
Published date : 24 Sep 2020 04:13PM