Skip to main content

పాలిటెక్నిక్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం: ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ

సాక్షి, అమరావతి/గుంటూరు రూరల్‌: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ, డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన, శ్రీవేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయాల పరిధిలోని పలు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ టి.గిరిధరకృష్ణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.


వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఇంజనీరింగ్‌ పాలిటెక్నిక్, ఉద్యాన పాలిటెక్నిక్, పశుపోషణ, మత్స్యశాస్త్ర పాలిటెక్నిక్‌ కోర్సులకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు పంపుకోవాలని ఆయన కోరారు. ఈ కోర్సుల్లో ప్రవేశానికి పదో తరగతి, లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు, ఇంటర్‌ ఫెయిలైన వారు అర్హులు. ఆగస్టు 19 నుంచి 28 వరకు దరఖాస్తులను పంపుకోవచ్చు. పూర్తి వివరాలకు www.angrau.ac.in  చూడొచ్చు.
Published date : 20 Aug 2021 07:10PM

Photo Stories