ఓయూ పీజీ సెమిస్టర్ పరీక్ష 2 గంటలే
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పీజీ కోర్సుల 4వ సెమిస్టర్ పరీక్షల సమయాన్ని 3 నుంచి 2 గంటలకు కుదించినట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ గురువారం వెల్లడించారు.
గతంలో ప్రకటించినట్లు ఈ నెల 12 నుంచి కాకుండా, 19 నుంచి 23 వరకు పరీక్షలు ఉంటాయని చెప్పారు. విద్యార్థులకు అందుబాటులో ఉండేలా రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాలలో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, మహబూబ్‌నగర్, వనపర్తి, నల్లగొండ, కోదాడ, కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పరీక్షలు రాయలేని విద్యార్థులు ఉస్మానియా వెబ్‌సైట్ ద్వారా తమకు దగ్గరగా ఉండే జిల్లా, పట్టణ కేంద్రంలో పరీక్షలు రాసేందుకు ఆప్షన్స్ ఇచ్చుకోవాలని కంట్రోలర్ సూచించారు. పూర్తి వివరాలకు 9440408333 నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
Published date : 09 Oct 2020 01:32PM