Skip to main content

ఒంగోలు, బాపట్ల మెడికల్ కాలేజీ నిధులకు అనుమతి

సాక్షి, అమరావతి: ఒంగోలులోని మెడికల్ కాలేజీ, బాపట్లలో కొత్తగా నిర్మిస్తోన్న కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించిన నిధులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఒంగోలు కాలేజీకి రూ.170 కోట్లు, బాపట్ల కాలేజీకి రూ.475 కోట్లకు అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన అనుమతులకు సవరణలు చేసినట్లు వెల్లడించారు.
Published date : 28 Apr 2021 03:05PM

Photo Stories