నవంబర్10 వరకు డిగ్రీ రిపోర్టింగ్ గడువు పెంపు: దోస్త్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా సీట్లు పొందిన విద్యార్థులంతా ఈనెల 10వ తేదీ వరకు స్వీయ రిపోర్టింగ్ చేయాలని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు.
ప్రత్యేక విడ త కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులతో పాటు అన్ని దశల్లో సీట్లు పొందిన విద్యార్థులంతా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సిన గడువును 10వ తేదీ వరకు పొడగించినట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వి ద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు.
Published date : 09 Nov 2020 03:52PM