నవంబర్ 1న గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలకు సంబంధించి నవంబర్ ఒకటో తేదీన అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఆరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యార్థులకు నిర్దేశించిన పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుందని వెల్లడించారు. అక్టోబర్ 15 నుంచి 31 వరకు సంబంధిత సొసైటీ వెబ్‌సైట్‌ల నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,49,168 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. కరోనా నిబంధనల ప్రకారం ఈ పరీక్షలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.
Published date : 12 Sep 2020 01:51PM