నవంబర్ 10లోగా సీట్లు రద్దు చేసుకున్న విద్యార్ధులకు పూర్తి ఫీజు వెనక్కు ఇచ్చేయండి: యూజీసీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్:దేశవ్యాప్తంగా డిగ్రీ, పీజీ కోర్సులే కాకుండా, బీటెక్, బీఫార్మసీ వంటి వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లోనూ విద్యార్ధులు నవంబర్ 10లోగా సీట్లను రద్దు చేసుకుంటే వారి పూర్తి ఫీజును వెనక్కి ఇచ్చేయాలని యూజీసీ స్పష్టం చేసింది.
ఉన్నత విద్యాకోర్సుల్లో మొదటి విడత ప్రవేశాలు అక్టోబర్ 20 నాటికి పూర్తవుతాయి. కనుక కాలేజీల్లో చేరిన విద్యార్ధులకు నవంబర్ 10 వరకు సీట్లను రద్దు చేసుకునే అవకాశమివ్వాలని ఆదేశించింది. ఆలోగా సీట్లను రద్దు చేసుకునే వారికి ఫీజుల్లో ఫీజును తిరిగి ఇచ్చేయాలని సూచించింది. ఈ నిబంధనను డిగ్రీ, పీజీ తదితర కోర్సుల్లో అమలు చేయాలని పేర్కొంది. ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 1000కి మించి మినహాయించుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. యూజీసీ ఆదేశాలను ఇంజనీరింగ్ కోర్సుల్లోనూ అమలు చేయాలని ఏఐసీటీఈ పేర్కొంది.
Published date : 04 Sep 2020 02:36PM