Skip to main content

నర్సింగ్ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ

సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య రంగంలో పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో నర్సింగ్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు అమలు చేయాలని స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్ణరుుంచింది.
ఇంగ్లాండ్‌కు చెందిన నేషనల్ హెల్త్ సిస్టమ్స్, హెల్త్ ఎడ్యుకేషన్ సంస్థల సహకారంతో నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు నేషనల్ హెల్త్ సిస్టమ్స్, హెల్త్ ఎడ్యుకేషన్ సంస్థలతో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది.

నెలకు రూ.1.20 లక్షల వేతనం
శిక్షణ కోసం ముందుకొస్తున్న వారి పేర్లను స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నమోదు చేసుకుంటోంది. బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేసినవారు, 2019లో బీఎస్సీ నర్సింగ్ ఫైనల్ ఇయర్ పరీక్ష రాసినవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన విధించింది. శిక్షణకు ఎంపికై న వారికి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి 3 వారాలపాటు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తారు. తరువాత విద్యార్థుల ఆంగ్ల భాషా ప్రావీణ్యత తెలుసుకునేందుకు మరో పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారికి ఐదు నెలలపాటు ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్‌పై శిక్షణ ఇస్తారు. మళ్లీ పరీక్ష నిర్వహించి, ఉత్తీర్ణులైన వారిని బ్రిటిష్ కౌన్సిల్ నిర్వహించే పరీక్షకు పంపుతారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే యూకేలోని ఆస్పత్రుల్లో నర్సులుగా ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు. వీరికి నెలకు రూ.1.20 లక్షల వరకు వేతనం లభిస్తుంది. ఈ మేరకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదనరెడ్డి, ఎండీ ఆర్జా శ్రీకాంత్ గ్లోబల్ లెర్నర్స్ ప్రోగ్రామ్ శిక్షణకు సంబంధించిన మెటీరియల్, పోస్టర్లను తాజాగా విడుదల చేశారు. నర్సింగ్‌లో శిక్షణకు సంబంధించి పూర్తి వివరాల కోసం టోల్‌ఫ్రీ నెంబరు 18004252422 ద్వారా సంప్రదించాలన్నారు.
Published date : 11 Jan 2020 02:47PM

Photo Stories