నిరుద్యోగులకు ఏపీఎన్‌ఆర్టీఎస్ శిక్షణ
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్టీఎస్) రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వనుందని సొసైటీ అధ్యక్షుడు వెంకట్ మేడపాటి ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంపికై న అభ్యర్థులకు శిక్షణ సమయంలో ఉచిత ఆహారం, వసతి సౌకర్యాలు కల్పిస్తామని, శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అంతర్జాతీయ స్థాయిలో సర్టిఫికెట్ జారీ చేస్తామన్నారు. ఎస్.ఎస్.సి, ఐటీఐ, ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ కలిగిన వారు అర్హులన్నారు. నాలుగు నెలల శిక్షణ, ప్రవేశాల కోసం అభ్యర్థులు ‘వావిలాల సంస్థ, 12/3 అరండల్ పేట, గుంటూరు, ఫోన్: 8500727678, లేదా వైఎస్సార్ ప్రవాసాంధ్ర కేంద్రం, బోయిన్‌పల్లి, రాజంపేట, ఫోన్: 8500127678లో సంప్రదించాలని కోరారు.
Published date : 17 Mar 2020 01:02PM