Skip to main content

నీట్‌, జేఈఈ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే..: సుప్రీంకోర్టు

సాక్షి,న్యూఢిల్లీ : క‌రోనా వైరస్‌ క్లిష్ట స‌మ‌యంలో జేఈఈ మెయిన్, నీట్ ప‌రీక్షల‌ను వాయిదా వేయాల‌ని ఆరు రాష్ట్రాలు దాఖ‌లు చేసిన‌ రివ్యూ పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు సెప్టెంబ‌ర్ 4వ తేదీన‌ కొట్టివేసింది.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే జేఈఈ, నీట్ ప‌రీక్షలు కొన‌సాగుతాయ‌ని ముగ్గురు న్యాయమూర్తుల‌తో కూడిన ధ‌ర్మసనం స్పష్టం చేసింది. కాగా విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించాలంటూ ఆగస్టు 17న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో కేంద్రం పరీక్షల నిర్వహణకు సిద్ధమైంది. అయితే దేశంలో క‌రోనా విస్తరిస్తున్న నేప‌థ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాల‌ని కోరుతూ బీజేపీయేతర పాలిత రాష్ట్రాలైన ప‌శ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, రాజ‌స్తాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, పంజాబ్‌, మ‌హారాష్ట్ర రాష్ట్రాల‌కు చెందిన మంత్రులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేసిన విషయం తెలిపిందే. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కోవిడ్ మహమ్మారి కారణంగా విద్యార్థుల విలువైన విద్యా సంవత్సరం కోల్పోరాదని అభిప్రాయపడింది. కోవిడ్‌ నిబ్బందనలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించాలని తెలిపింది. జేఈఈ మెయిన్ పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి కొనసాగుతుండ‌గా నీట్ ప‌రీక్ష సెప్టెంబ‌ర్ 13 న జ‌ర‌గనుంది.
Published date : 04 Sep 2020 06:46PM

Photo Stories