నీట్–ఎండీఎస్ అడ్మిషన్ల కౌన్సిలింగ్ ఎప్పుడు?.. సుప్రీంకోర్టు
Sakshi Education
న్యూఢిల్లీ: నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్)–ఎండీఎస్ అడ్మిషన్ల కౌన్సిలింగ్ తేదీలను ఖరారు చేయకపోవడంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది.
కౌన్సిలింగ్‌ను ఎప్పుడు నిర్వహించేదీ ఈనెల 11వ తేదీ కల్లా తమకు తెలియజేయాలని ఆదేశించింది. నీట్– ఎండీఎస్(మాస్టర్ ఇన్ డెంటల్ సర్జరీ)–2021 కౌన్సిలింగ్ షెడ్యూల్ ఖరారు చేయడంలో మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (ఎంసీసీ) మితిమీరిన జాప్యంతో తమకు అన్యాయం జరుగుతోందంటూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రత్యేకంగా తమకు కౌన్సిలింగ్ చేపట్టేలా ఎంసీసీని ఆదేశించాలని వారు ఆ పిటిషన్‌లో కోరారు. దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం సోమవారం విచారించింది. మెడికల్ సీట్లలో ఓబీసీ కోటాను కూడా కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసినందున కౌన్సిలింగ్‌లో ఆలస్యం ఎందుకవుతోందని ప్రశ్నించింది.
Published date : 10 Aug 2021 05:30PM