నేటితో ముగియనున్న డిగ్రీ మొదటి దశ రిజిస్ట్రేషన్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ మొదటి దశ ఆన్‌లైన్ ప్రవేశాల కోసం ఆదివారం వరకు 1,41,553 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు.
అందులో 1,12,870 మంది దరఖాస్తులను సబ్మిట్ చేశారని, 29,344 మంది మాత్రమే వెబ్ ఆప్షన్లు (తమకు కావాల్సిన కాలేజీని ఎంచుకున్నవారు) ఇచ్చుకున్నారని వెల్లడించారు. విద్యార్థుల రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 7తో ముగుస్తుందని, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ 8న ముగుస్తుందని తెలిపారు. ఇప్పటివరకు చాలా తక్కువ మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని, మిగతా విద్యార్థులంతా త్వరగా ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు.
Published date : 07 Sep 2020 03:52PM